బిత్తిరి సత్తి గరంగరం

Bittiri Sathi's Garam Garam
Monday, July 27, 2020 - 12:30

కొత్త మేనేజిమెంట్ పిచ్చి చేష్టల వల్ల టీవీ9ను వదిలేసి సాక్షి ఛానెల్ లో చేరిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన డిఫరెంట్ స్టయిల్, మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బిత్తిరి సత్తి.. త్వరలోనే గరంగరం వార్తలు అనే కార్యక్రమంతో సాక్షిలో అలరించబోతున్నాడు.

ప్రతి రోజూ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు, తిరిగి మరుసటి రోజు ఉదయం  8 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. లేటెస్ట్ ప్రొగ్రామ్ లో సత్తి ఎలాంటి అవతారంలో కనిపించబోతున్నాడనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు.

సత్తి జనాల మధ్య ఉండాలి, రొడ్డుపై కలియతిరగాలి, పంచ్ లు వేయాలి. కామెడీ పండించాలి. అదే జనాలకు ఇష్టం. అయితే ఈసారి మాత్రం సత్తి యాంకర్ అవతారం ఎత్తాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో న్యూస్ రీడర్ గా కనిపించాడు. అది కేవలం ప్రోమోకే పరిమితమా లేక ఒరిజినల్ కార్యక్రమంలో కూడా ఆయన యాంకర్ గా కనిపిస్తాడా అనేది చూడాలి.