బోయ‌పాటి ప‌రిస్థితి ఏంటి?

Boyapati is in confusion over next film
Thursday, July 18, 2019 - 23:00

మొన్న‌టి వ‌ర‌కు టాప్ డైర‌క్ట‌ర్‌గా ఉన్న బోయ‌పాటి శీను సీన్ ఒక్క‌సారిగా మారిందిపుడు. విన‌య విధేయ రామ‌...అత‌ని కెరియ‌ర్‌ని విధ్వంసం చేసింది. మరో కొత్త సినిమా మొదలుపెట్టాలంటే ఎన్నో లెక్క‌లు వేసుకోవాల్సి వ‌స్తోంది. బాల‌కృష్ణ‌తో మూడో చిత్రం మొద‌లుపెడుదామ‌ని రాసుకున్న క‌థ‌ని నిర్మాత దిల్‌రాజు నో చెప్పేశాడు. బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సినిమా నిర్మించేందుకు దిల్‌రాజు రెడీ అయ్యాడు. ఐతే బోయ‌పాటి చెప్పిన బ‌డ్జెట్ వ‌ర్క‌వుట్ కాద‌ని ముఖం మీదే చెప్పేశాడ‌ట ఆ లీడింగ్ ప్రొడ్యుస‌ర్‌.

ఇక ఇపుడు యంగ్ హీరోల చుట్టూ బోయ‌పాటి తిరుగుతున్నాడు. వాళ్ల‌ని ఒప్పించ‌డం అంత ఈజీ కాదు. బోయ‌పాటి మార్క్ వ‌య‌లెన్స్‌ని, మాస్‌ని త‌ట్టుకునే శ‌క్తి నేటిత‌రం యంగ్ హీరోల‌కి లేదు. చేస్తే గీస్తే మార్ ముంత చోడ్ చింత స్టార్ చేయాలేమో! రామ్‌లాంటి హీరోల‌తోనూ బ‌డ్జెట్ స‌మ‌స్యే ఉంటుంది. బోయ‌పాటి ఊహ‌ల‌కి, నిర్మాత‌లు విధిస్తున్న లెక్క‌ల ప‌రిమితుల‌కి లంకె కుద‌ర‌డం లేదు.

అందుకే బోయ‌పాటి కొత్త సినిమా ప్రారంభించ‌డానికి మ‌రికొంత కాలం ఆగ‌క త‌ప్ప‌దు. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ఇటీవ‌ల‌... బోయపాటి త‌మ బ్యాన‌ర్‌లో మూవీ చేస్తాడ‌ని ప్ర‌క‌టించాడు. కానీ బ్యాన‌ర్ ఉన్నా...హీరో ఉండాలి క‌దా. అదే స‌మ‌స్య‌.

|

Error

The website encountered an unexpected error. Please try again later.