హమ్మయ్య బోయపాటి మారలేదు

Boyapati Shows his mass angle
Friday, July 21, 2017 - 17:00

మొన్నటివరకు చాలామంది భయపడ్డారు. బోయపాటి ఏంటి ఇలా మారిపోయాడు అని బెంగెట్టుకున్నారు. జయజానకి నాయక ఫస్ట్ లుక్ స్టిల్ చూసినప్పుడు అది శేఖర్ కమ్ముల స్టిల్ లా అనిపించింది. ఆ తర్వాత ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయినప్పుడు అంతా ఒకటే షాక్. బోయపాటి ఏంటి ఇంతలా మారిపోయాడు అనుకున్నారంతా. టీజర్ అంతా కూల్ గా ప్లజెంట్ గా ఉండిది. 

ఈ ఒక్క టీజర్ తో బోయపాటి శ్రీను మారిపోయాడంటా చాలా కథనాలు వచ్చేశాయి. కానీ ఈ మాస్ దర్శకుడు మారలేదు. పైకి అలా క్లాస్ గా టీజర్ వదిలినప్పటికీ.. లోపల మాస్ అలానే ఉందని చూపించాడు. దానికి ఎగ్జాంపుల్ గా సెకెండ్ టీజర్ విడుదల చేశారు. జయజానకి నాయక సెకెండ్ టీజర్ చూసినవాళ్లంతా హమ్మయ్య బోయపాటి మారలేదని నిర్థారణకు వచ్చారు. 

అదే యాక్షన్, అవే డైలాగ్స్, చివరికి కెమెరా యాంగిల్స్ కూడా అవే. బోయపాటి మారలేదు. తన స్టయిల్ మార్చలేదు. జయజానకి నాయక సాఫ్ట్ ముూవీ కాదు. అక్కడక్కడ మాత్రమే లవ్, ఓవరాల్ గా యాక్షనే. ఇదీ.. సెకెండ్ టీజర్ తో సభ్యసమాజానికి బోయపాటి ఇచ్చిన సందేశం.