బ్రూస్‌లీ అపుడు చ‌రణ్ ఏమి చేశాడు?

Boyapati slams Ram Charan over his letter to fans
Thursday, February 7, 2019 - 16:00

"సింహా" సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఫ‌లానా అపుడు నో పోలీసు, ఫ‌లానా అపుడు నో పోలీసు.. అపుడు లేవ‌ని నోరు ఇపుడు ఎందుకు అన్న రీతిలో ఉంటుంది. ఇపుడు దాదాపు అదే స్ట‌యిల్‌లో బోయ‌పాటి నిర్మాత దాన‌య్య‌పై ఎగిరాడ‌ట‌.

చ‌ర‌ణ్ కెరియ‌ర్‌లో అతిపెద్ద డిజాస్ట‌ర్స్ మూడు. ఒక‌టి "ఆరెంజ్‌". రెండోది "తుఫాన్" (జంజీర్‌), మూడోది "బ్రూస్‌లీ". ఈ మూడు సినిమాలు ఫ్లాప్ అయిన‌పుడు చ‌ర‌ణ్ అభిమానుల‌కి లేఖ రాయ‌లేదు. వివ‌ర‌ణ ఇచ్చుకోలేదు. అపుడు చేయ‌ని ప‌ని ఇపుడు "విన‌య విధేయ రామ‌"కి ఎందుకు చేశాడు అని బోయ‌పాటి నిర్మాత దాన‌య్య‌పై ఫైర్ అయ్యాడ‌ట‌. నా సినిమా ఫ్లాప్ అయినా 60 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు అందుకొంది. మ‌రి ఆ సినిమాలు ఎంత క‌లెక్ట్ చేశాయి అని అడిగాడ‌ట‌.

రామ్‌చ‌ర‌ణ్ ఇటీవ‌ల త‌న అభిమానుల‌కి లేఖ రాశాడు. "విన‌య విధేయ రామ సినిమా" ఇంత దారుణంగా ప‌రాజ‌యం పాలు అవుతుంద‌ని అనుకోలేద‌ని, మిమ్మ‌ల్ని ఈ సినిమా నిరాశ‌ప‌ర్చినందుకు బాధ‌ప‌డుతున్నాన‌ని హుందాగా లెట‌ర్ రాశాడు. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ ఇలా చేస్తుంటాడు. ఆ ట్రెండ్‌ని చ‌ర‌ణ్ ఫాలో అయ్యాడు. అదే ఇపుడు అత‌న్ని ఇబ్బందుల‌కి గురి చేస్తోంది. ఈ సినిమా ద్వారా బ‌య్య‌ర్లు 32 కోట్లు న‌ష్ట‌పోయారు. వారికి ప‌రిహారం ఇద్దామ‌ని నిర్మాత దాన‌య్య, హీరో చ‌ర‌ణ్ రెడీ అయ్యారు. మీ వంతుగా ఇవ్వండి అని బోయ‌పాటికి నిర్మాత ఫోన్ చేశాడ‌ట‌. అపుడు బోయ‌పాటి పై డైలాగ్‌లు విసిరాడ‌ట‌.

నిజ‌మే క‌దా..బోయ‌పాటి వాద‌న‌లోనూ మీనింగ్ ఉంది క‌దా!