బ్రహ్మీని వాడేస్తోన్న పోలీసులు

Brahmanandam for corona message
Monday, July 20, 2020 - 14:00

కరోనా విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణలోనూ విలయతాండవం చేస్తోంది. 13 లక్షలకి పైగా టెస్టులు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయినా కరోనా కంట్రోల్ లోకి రావట్లేదు. తెలంగాణలో కేసులు తక్కువ కనిపిస్తున్నా.. టెస్టుల్లో వెనకబడింది. రూరల్ తెలంగాణాలో కేసులు బాగా పెరుగుతున్నాయి. అంటే... వ్యాప్తి చాలా ఉందని కచ్చితంగా చెప్పొచ్చు. ఓవరాల్ గా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం ఇప్పట్లో ఆగేలా లేదు. 

అందుకే స్థానిక అధికారులు, పోలీసులు ప్రజల్లో అహగాహన కోసం కొత్త కొత్త మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో విజయనగరం పోలీసులు టౌన్ లో పెట్టిన ప్లెక్సీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నవ్వు తెప్పించే బ్రహ్మి మీమ్ తో మంచి సందేశాన్ని ఇస్తున్నారు విజయనగరం పోలీసులు. 

బ్రహ్మి ఫొటోతో కూడిన ప్లెక్సీలో ఉన్నది ఏంటంటే... 

"నేను ఏమంటాను అంటే.. విల్లాలో ఉంటూ కేర్ఫుల్ గా ఉండే అమితాబ్, అభిషేక్ బచ్చన్ లకే కరోనా వస్తే... చీటికీ మాటికీ కొత్తిమీర, కరివేపాకు వంకతో బయట తిరిగే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకో... మీ క్షేమాన్ని కోరే విజయనగరం పోలీసులు."

బాగుంది కదా  ప్లెక్సీ కాన్సెప్ట్.