క‌త్తి రెడ్డిగా బ్ర‌హ్మి!

Brahmanandam finally gets a film
Monday, July 3, 2017 - 20:00

ఒక‌పుడు బ్ర‌హ్మి లేని తెలుగు సినిమా విడుద‌ల‌య్యేది కాదు. ఇపుడు బ్ర‌హ్మి ఉన్న మూవీ ఏది అని అడిగితే మీ బుర్ర‌కి బాగా ప‌ని పెట్టాలి. ఒడ‌లు బ‌ళ్లు అవుతాయి అన‌డానికి బ్ర‌హ్మి ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌. ఏడాది గ్యాప్‌లోనే ఆయ‌న ఫేట్ మొత్తం మారింది.

కొంత‌కాలంగా గ్రాండ్ కిడ్స్‌తోనే ఇంట్లో కాల‌క్షేపం చేస్తున్నాడు. అఫ్‌కోర్స్ కోట్ల‌ల్లో సంపాదించాడు. ప‌ని లేద‌నే బాధ త‌ప్ప మ‌నీ లేద‌న్న చింత లేదు. అయితే ఆయ‌న‌కి మ‌ళ్లీ కొంత ప‌ని క‌ల్పించే సినిమా ఒక‌టి ద‌క్కింది. బ్ర‌హ్మికి మ‌ళ్లీ ఒక సినిమాలో కీ రోల్ పోషించే చాన్స్ వ‌చ్చింది.

బ్రహ్మానందం లీడ్ రోల్ లో న‌టించ‌నున్న కొత్త సినిమా.."కత్తి రెడ్డి". "ఎత్తితే .. దించడు" అనేది ట్యాగ్ లైన్. బ్రహ్మానందం లీడ్ రోల్ పోషించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంద‌ట‌. వి రవివర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మ‌చ్చ ర‌వి ఒక ప్ర‌ధాన పాత్ర‌లో కనిపిస్తాడు. ఇత‌ర వివ‌రాలు తెలియాలి. 

మ‌రి ఈ సినిమాతో అయినా ఖాన్‌దాదాకి ఫేట్ మారుతుందా?