క్రాక్ లో కిర్రాక్ కాంబినేషన్ మిస్

Brahmanandam is not playing in Krack
Saturday, July 11, 2020 - 17:30

కెరీర్ లో రవితేజ ఎంతో కామెడీ చేసి ఉండొచ్చు. కానీ బ్రహ్మీతో మాస్ రాజా చేసిన హంగామాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా తన కెరీర్ లో ఎన్నో కామెడీ పాత్రలు చేశారు కానీ రవితేజ కాంబోలో బ్రహ్మి కామెడీకి సెపరేట్ మార్క్, ఇమేజ్ ఉంది.

వీళ్లిద్దరి కాంబో కామెడీకి మంచి గిరాకీ ఉంది. ఒకానొక టైమ్ లో రవితేజ సినిమాలో బ్రహ్మానందంతో కాంబినేషన్ సీన్లు ఉండాల్సిందే. ఆ రేంజ్ లో వీళ్ల హవా నడిచింది. అయితే అప్ కమింగ్ మూవీ "క్రాక్" లో మాత్రం ఈ కిర్రాక్ కాంబినేషన్ రిపీట్ అవ్వడం లేదు.

ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని బయటపెట్టాడు. "క్రాక్" సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడు కానీ, రవితేజ-బ్రహ్మానందం కాంబో మాత్రం లేదంటున్నాడు ఈ దర్శకుడు. వీళ్ల కాంబినేషన్ లో సీన్స్ ను కథ డిమాండ్ చేయలేదని చెబుతున్నాడు.

అలా "క్రాక్" లో రవితేజ-బ్రహ్మానందం కామెడీ మిస్ అయింది.