బన్ని మౌనం వీడితే మంచిదేమో!

Bunny keeps mum on Sye Raa
Monday, September 23, 2019 - 19:00

ఆ మధ్య చెప్పను బ్రదర్‌ అని కామెంట్ చేసి పవన్‌ కల్యాణ్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఏడాదిన్నర తర్వాత ఆ వేడి చల్లారింది. మళ్లీ పవర్‌స్టార్‌తో కలిసిపోయాడు అల్లు అర్జున్‌. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా జనసేన తరఫున పాలకొల్లు ప్రాంతంలో ప్రచారం చేశాడు. ఆ విధ్యంగా బన్ని ఫ్యాన్స్‌కి, పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి ప్యాచప్‌ అయింది. మెగా విభేదాలకి దాంతో ప్యాకప్‌ పడింది అని అనుకున్నారంతా. 

ఇపుడు ఇంకో కొత్త వివాదం మొదలైంది. 

సైరా సినిమాకి సంబంధించి బన్ని ఏ మాట మాట్లాడడం లేదనేది తాజా కామెంట్‌.

సైరా సినిమా ట్రయిలర్‌ విడుదలైనపుడు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, అమితాబ్‌ బచ్చన్‌, అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, రాజమౌళి, విజయ్‌ దేవరకొండ, నాని మొదలుకొని... సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలందరూ ట్వీట్‌ చేశారు. ట్రయిలర్‌ని మెచ్చకున్నారు. కానీ బన్ని తన సోషల్‌ మీడియాలో ఈ సినిమా ట్రయిలర్‌ని షేర్‌ చేయలేదట. కామెంట్‌ పెట్టలేదట. బన్ని మౌనం వెనుక రీజన్‌ ఏంటో అని మెగాభిమానులు దీర్ఘాలోచనలో ఉండగానే.. సైరా ఈవెంట్‌ జరిగింది. 

ఈ ఈవెంట్‌కి కూడా బన్ని రాలేదు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ఉన్న స్టేజ్‌పై కనిపించని మరో మెగా సింహమే.. బన్ని. అలా ఎందుకు జరిగిందని అందరూ ఆరా తీయడం షురూ చేశారు. చిరుకి, బన్నికి గ్యాప్‌ వచ్చే సమస్యే లేదు. మెగా కుటుంబానికి చిరంజీవే పౌండేషన్‌. మరి బన్నిని గ్యాప్‌ తీసుకున్నాడా లేకా గ్యాప్‌ వచ్చిందా అనేది క్లియర్‌ చేయాలి. మౌనం మంచిది కాదు.