బన్నీ ఆహారపు అలవాట్లు ఇవే

Bunny's food habits
Saturday, January 25, 2020 - 22:00

స్టయిలిష్ స్టార్ అనే ఇమేజ్ ను కొనసాగించాలంటే కష్టపడాల్సిందే. అలాంటి కష్టాన్ని రోజూ పడతానంటున్నాడు అల్లు అర్జున్. ఫిట్ గా స్టయిల్ గా ఉండేందుకు వారానికి కనీసం 3 సార్లు జిమ్ చేస్తానని, కొన్నిసార్లు వారానికి 7-8 సార్లు జిమ్ కు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నాడు. ఇక ఆహారపు అలవాట్లు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతానంటున్నాడు.

"ఉదయం లేచిన వెంటనే 45 నిమిషాల పాటు ఖాళీ కడుపుతో ట్రెడ్ మిల్ చేస్తాను. అదే నా హెల్త్ సీక్రెట్ అనుకుంటున్నాను. ఏది పడితే అది తినను. లంచ్, డిన్నర్ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. కానీ బ్రేక్ ఫాస్ట్ మాత్రం దాదాపు ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఎక్కువ రోజులు బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తింటాను. నేను చేసే సినిమా, అందులో నా లుక్ బట్టి డైట్ మారిపోతుంటుంది. ఇక లేట్ నైట్ మీల్ విషయానికొస్తే.. ఒక్కోసారి చాలా లేట్ అయిపోతుంది. ప్రతి రోజూ రాత్రి చాక్లెట్ తినడం అలవాటు."

తన కండలు చూపించాల్సిన అవసరం లేని సినిమా చేసినప్పుడు మాత్రం డైట్ ప్లాన్ పక్కనపెట్టేస్తానంటున్నాడు బన్నీ. ఆ టైమ్ లో మాత్రం తన మనసుకు నచ్చిన భోజనాన్ని లాగించేస్తానంటున్నాడు.  అయితే ఎంత తిన్నా ఎక్సర్ సైజ్ మస్ట్ అని చెబుతున్నాడు.

"ఒక్కోసారి ఆహార అలవాట్లు పక్కనపెట్టేస్తాను. సినిమా జానర్ బట్టి డైట్ మారిపోతుంది. ఏదైనా కుటుంబకథా చిత్రం చేస్తుంటే మాత్రం డైట్ ప్లాన్ పెద్దగా పట్టించుకోను. నచ్చినవన్నీ  తినేస్తుంటాను. ఎందుకంటే అందులో నా బాడీ, కండలు, ఛెస్ట్ చూపించాల్సిన అవసరం ఉండదు కదా. అయితే కొన్ని పాలఉత్పత్తులు మాత్రం నేను అస్సలు టచ్ చేయను."