నితిన్‌పై కేసు కొట్టివేత‌

Case against Nithin and his sister quashed
Tuesday, January 9, 2018 - 13:45

అఖిల్ మొద‌టి సినిమా నిర్మించి న‌ష్టాల‌తో పాటు కేసులు కూడా పొందారు నితిన్‌, ఆయ‌న తండ్రి సుధాక‌ర్‌రెడ్డి. ఆ సినిమా విడుద‌లై రెండేళ్లు అయింది. అయితే అప్ప‌టి నుంచి ఒక కేసు నితిన్‌ని, ఆయ‌న సోద‌రి నిఖిత‌ని వెంటాడింది. ఇపుడు ఆ కేసుని కొట్టిపారేసింది మల్కాజిగిరి కోర్టు.

‘అఖిల్‌’ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ హక్కులు ఇస్తామంటూ రూ.50 లక్షలు తీసుకుని, ఇవ్వకుండా మోసం చేశారంటూ సికింద్రాబాద్‌కు చెందిన జి.సత్యనారాయణ అనే వ్యక్తి మల్కాజిగిరి కోర్టులో ఫిర్యాదు చేశారు. నితిన్‌తోపాటు సోదరి నిఖితారెడ్డి, తండ్రి సుధాకర్‌రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు.

ఈ కేసును కొట్టివేయాలంటూ నితిన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీష‌న్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల విచారణ చేపట్టారు. ఈ వ్యవహారం చెక్కులకు సంబంధించిన సివిల్‌ వివాదమని, క్రిమినల్‌ కేసు పెట్టడం సరికాదని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.