ట్యాక్సీవాలా పైర‌సీ చేసింది ఇంటిదొంగే!

Case booked against Taxiwaala piracy
Monday, October 1, 2018 - 09:45

విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం జూన్‌లో విడుద‌ల కావాలి. కానీ ఆ సినిమా గ్రాఫిక్స్ వ‌ర్క్ పూర్తి కాక‌పోవ‌డం, అలాగే సినిమాలో కీల‌క‌మైన సీన్ల‌న్ని బ‌య‌టికి రావ‌డంతో విడుద‌ల ఆగింది. ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే పైర‌సీకి గురైంది. నిర్మాత ఎస్‌కెఎన్ (గాదె శ్రీనివాస‌కుమార్‌) తాజాగా పోలీసులకి ఫిర్యాదు చేశారు. 

పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిదొంగే ఈ ప‌ని చేశాడ‌ట‌. ప్రొడ‌క్ష‌న్‌లో ఎడిటింగ్ విభాగానికి చెందిన ఓ వ్యక్తే దీనికి కారణంగా గుర్తించారు.  దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు పోలీసులు. 

మ‌రోవైపు టాక్సీవాలా చిత్రాన్ని అక్టోబరు నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెల‌ప‌డం విశేషం.