ఇండస్ట్రీలో "దానికి" కోడ్ వర్డ్ అదే

Casting Couch and its dirty secrets
Sunday, June 7, 2020 - 12:00

హీరోయిన్లను "కమిట్ మెంట్" ఎలా అడుగుతారు? అసలు వాళ్లను ఎలా అప్రోచ్ అవుతారు? ఇక్కడే రకరకాల పదాలు పుట్టుకొస్తాయి. సరిగ్గా అందులో పదమే "షాపింగ్".

అవును.. ఇది చాలా చిన్న పదం. కానీ ఇండస్ట్రీలో ఈ పదం వెనక పరమార్థం, అంతరార్థం చాలా ఉంటుందని చెబుతోంది ఒకప్పటి హీరోయిన్ మాధవీలత. ఎవరైనా ఓ హీరోయిన్ దగ్గరకొచ్చి షాపింగ్ కు వెళ్దామా అని పిలిస్తే దానర్థం.. రాత్రికి వస్తావా అని అంట. 

"పడుకోడానికి వస్తావా అని అడగలేక లంచ్ కు వస్తావా.. డేటింగ్ కు వస్తావా.. షాపింగ్ కు వస్తావా అని అడుగుతారు. ఇండస్ట్రీలో షాపింగ్ కు వస్తావా అని అడిగారంటే సెక్స్ కు వస్తావా అని అడిగినట్టు. షాప్ ఓపెనింగ్ కు రమ్మంటున్నారు దాంతో పాటు ఇంకాస్త ఎక్స్ ట్రా కోపరేట్ చేయాలని అడుగుతారు. ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అని చెప్పాలి. లేదంటే నాట్-ఇంట్రెస్టెడ్ అనేయాలి."

ఇలా షాపింగ్, షాప్ ఓపెనింగ్ వెనక జరిగే కథల్ని బయటపెట్టింది మాధవీలత.  ఈ విషయంలో ఈ హీరోయిన్, ఆ హీరోయిన్ అనే తేడా ఉండదని.. ప్రతి హీరోయిన్ ను ప్రతి ఒక్కరు అడుగుతారని కుండబద్దలుకొట్టింది.