నిజాన్ని ఒప్పుకున్న కేథరీన్

Catherine Tresa agrees that she has no craze
Saturday, February 8, 2020 - 17:15

హీరోయిన్లను అవకాశాల గురించి ప్రశ్నిస్తే రొటీన్ ఆన్సర్ వస్తుంది. చాలా కథలు వింటున్నానని, మనసుకు నచ్చిన స్టోరీ దొరకడం లేదని కబుర్లు చెబుతారు. లేదంటో తమిళ్ లో ఫోకస్ పెట్టాను కాబట్టి తెలుగులో తగ్గిందంటారు. ఇంకా లేదంటే, తను కావాలనే గ్యాప్ తీసుకుంటున్నానని, మంచి స్క్రిప్ట్ తో బౌన్స్ బ్యాక్ అవుతానని కలరింగ్ ఇస్తారు. కానీ కేథరీన్  మాత్రం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతోంది. అవును.. నాకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయంటోంది ఈ ముద్దుగుమ్మ.

చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది కేథరీన్   . కానీ ఆమెకు స్టార్ స్టేటస్ రాలేదు. బన్నీ, రానా లాంటి హీరోల సరసన నటించినా ఆమెకు క్రేజ్ రాలేదు. ఇదే విషయంపై ప్రశ్నిస్తే ఎందుకో అర్థం కావడం లేదని అయోమయంగా ఫేస్ పెట్టింది క్యాథరీన్. తను గ్లామరస్ గా ఉంటానని, యాక్టింగ్-డాన్స్ కూడా బాగా చేస్తానని, కానీ ఎందుకో తనకు అవకాశాలు అనుకున్న స్థాయిలో రావడం లేదని అంగీకరించింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి "వరల్డ్ ఫేమస్ లవర్" అనే సినిమా చేస్తున్న కేథరీన్... . తన కెరీర్ కు ఈ సినిమా గేమ్ ఛేంజర్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమా కూడా ఇదొక్కటే.