అందుకే నాకు పెళ్లి కావడం లేదు - క్యాథరీన్

Catherine Tresa talks about wedding
Tuesday, October 8, 2019 - 23:00

"నాకు పుట్టుక నుంచే ఓ సమస్య ఉంది. నేను  వాసన పసిగట్టలేను. నాది మధ్యతరగతి కుటుంబం. నాన్న నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. కానీ వాసన పసిగట్టలేని నా సమస్య కారణంగా నాకు పెళ్లి అవ్వడం లేదు.  ఒకవేళ ఇదే సమస్యతో నాకు పెళ్లి అయితే, పుట్టిన పిల్లల్ని నేను సరిగ్గా చూసుకోగలనా లేదా అని నాకు భయం. అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు."

హీరోయిన్ క్యాథరీన్ త్రెసా స్టేట్ మెంట్ ఇది. తను వాసనల్ని గుర్తించలేనని, అందుకే పెళ్లి చేసుకోనని ప్రకటించింది ఈ బ్యూటీ. అయితే ఇదంతా రియల్ లైఫ్ లో కాదు. సినిమాలో ఆమె పాత్ర. సిద్దార్థ్ హీరోగా నటించిన వదలడు అనే సినిమాలో తన పాత్రను ఇలా వర్ణిస్తూ చెప్పుకొచ్చింది క్యాథరీన్. ఈ సినిమాలో తను జ్యోతి అనే టీచర్ పాత్రను పోషిస్తున్నానని, వాసనల్ని పసిగట్టలేనని అంటోంది. మరోవైపు ఎక్కువగా తమిళ్ లోనే నటించడంపై కూడా స్పందించింది క్యాథరీన్.

"నేను ఎక్కువగా తమిళ్ లోనే సినిమాలు చేస్తున్నాను. తెలుగంటే ఇష్టం లేక కాదు. మంచి పాత్రలు కోలీవుడ్ నుంచే వస్తున్నాయి. తెలుగు నుంచి కూడా మంచి క్యారెక్టర్స్ వస్తే నటిస్తాను. సరైనోడులో చేసిన పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ కావాలి నాకు."

వదలడు సినిమాతో తెలుగులో మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతానంటోంది ఈ బ్యూటీ. టాలీవుడ్ నుంచి బన్నీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటానని, ఇంకా ఇక్కడ చాలామంది తనకు ఫ్రెండ్స్ ఉన్నారంటోంది ఈ మలయాళీ బ్యూటీ.