ఓన్లీ నియ‌ర్ అండ్ డియ‌ర్‌!

Chaitanya and Samantha Wedding: Only near and dear are invited
Wednesday, September 13, 2017 - 20:00

నాగ చైత‌న్య‌, స‌మంత‌ల డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి అతిథుల లిస్ట్ ఆల్రెడీ పూర్త‌యింది. అతిథులంద‌రికీ పెళ్లి పత్రిక‌లు అందాయి. ఇంత‌కీ ఎంద‌రిని ఇన్వైట్ చేశారు అనుకుంటున్నారూ? కేవ‌లం 150 మందికే అనుమ‌తి. 

జ‌న‌ర‌ల్‌గా అయితే వీరి పెళ్లికి మొత్తం సినిమా ఇండ‌స్ర్టీలో ఉన్న వారంద‌రికీ ఇన్విటేష‌న్లు వెళ్లాలి. అలాగే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన రాజ‌కీయ‌, వ్యాపార ప్ర‌ముఖులంద‌రికీ ఆహ్వానాలు ఉండాలి. కానీ  చైత‌న్య‌, స‌మంత కుటుంబ స‌భ్యులు, వారిద్ద‌రికీ చెందిన నియ‌ర్ అండ్ డియ‌ర్‌కి మాత్ర‌మే పెళ్లి పిలుపు అందిందింది. అంతా క‌లిపి 150. ఇది వారి గెస్ట్ లిస్ట్‌.

డెస్టినేష‌న్ వెడ్డింగ్ అనే కాన్సెప్ట్‌తో గోవాలోని ఒక రిసార్ట్‌లో అక్టోబ‌ర్ 6, 7 తేదీల్లో వీరి పెళ్లి జ‌రుగుతుంది. ఒక రోజు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం, మ‌ర్నాడు క్రిస్టియ‌న్ ప‌ద్ద‌తి ప్ర‌కారం. బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఎటువంటి హంగామా లేకుండా ఆనందంగా పెళ్లి వేడుకలు జ‌రుపుకోవాల‌నేది సమంత కోరిక‌న‌ట‌. హైద‌రాబాద్‌లో అయితే పెళ్లి వేడుక‌ల‌ను ఎంజాయ్ చేసే అవ‌కాశం ఉండ‌దు. మొత్తం గెస్ట్‌లంద‌రూ వ‌రుస‌గా క్యూ క‌డుతారు. అంద‌రితో ఫోటోల‌కి ఫోజులిచ్చేస‌రికే తెల్లారుతుంది, ఇక సంబ‌రంగా ఎలా జ‌రుపుకోగ‌ల‌మ‌ని స‌మంత భావించింద‌ట‌. అందుకే ఇలా. 

మ‌రి ఇండ‌స్ర్టీ ప్ర‌ముఖులు ఫీల్ అవ‌రూ? అందుకే నాగార్జున త‌ర్వాత భారీ వెడ్డింగ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తున్నారు.