అమ్మాయిలపై చ‌ల‌ప‌తిరావు పైత్య‌పు మాట‌

Chalapathi Rao makes cheap comment, says women are better for sex only
Monday, May 22, 2017 - 14:00

వ‌య‌సు మ‌ళ్లినా బుర్ర పెర‌గ‌లేదు. ఆయ‌న బుద్ది మార‌లేదు. ప‌బ్లిక్‌గా బూతులు, ద్వంద్వార్థాలు వ‌చ్చే మాట‌లు మాట్లాడే తెలుగు సినిమా సెల‌బ్రిటీలు ప‌లువురు ఉన్నారు. ఆలీ వంటి వారి గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఇలాంటి వారిలో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావుది ఫ‌స్ట్‌ప్లేస్‌. ఇప్ప‌టికే ఎన్నోసార్లు ఆయ‌న ఛీప్ కామెంట్స్ చేశారు. అయినా ఆయ‌న తీరు మార‌ట్లేదు.

తాజాగా "రారండోయ్ వేడుక చూద్దాం" ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో ఆయ‌న చేసిన ఒక మాట వివాద‌స్ప‌ద‌మ‌యింది. అమ్మాయిల గురించి ఆయ‌న చేసిన ఒక వీడియో ఇపుడు వైర‌ల్‌గా మారింది. 

ఆయ‌న చేసిన కామెంట్ ఏంటంటే.. "అమ్మాయిలు ప‌క్క‌లోకి ప‌నికొస్తారు."

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నాగ చైత‌న్య ఒక మాట అంటాడు. అమ్మాయిలు ఆరోగ్యానికి హానిక‌రం అనేది ట్ర‌యిల‌ర్‌లో ఉన్న డైలాగ్‌. అది సినిమాలో ఏ సంద‌ర్భంలో ఎలా అంటాడో చూడాలి. కానీ దాన్ని పంచ్ డైలాగ్‌గా ప్ర‌మోష‌న్లో ఈ టీమ్ వాడుకుంటోంది. దీని గురించి మీ స్పంద‌న ఏంటి అని ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో యాంక‌ర్ అంద‌రి అభిప్రాయాలు తీసుకొంది. అలాగే సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తి రావుని అడిగారు. అమ్మాయిలు హానిక‌ర‌మా అని అడిగితే ఆయ‌న స‌మాధనం ఇది - "అమ్మాయిలు ప‌క్క‌లోకి ప‌నికొస్తారు."

ఇది ఆయ‌న సంస్కారం.