చందూ టాలెంట్ ఇంతేనా?

Chandoo Mondeti proves his talent?
Sunday, November 4, 2018 - 11:00

చందూ మొండేటి త‌న మొద‌టి సినిమాతో ఒక‌వ‌ర్గం ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తీకేయ ఆయ‌న మొద‌టి చిత్రం. ఆ సినిమా క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. ఒక‌పుడు టీవ‌లో వ‌చ్చిన ర‌హ‌స్యం అనే సీరియ‌ల్ త‌ర‌హా క‌థే. కానీ దాన్ని నేటి త‌రానికి అనుగుణంగా గ్రిప్పింగ్‌గా మ‌ల‌చ‌డంలో చందూ మొండేటి స‌క్సెస్ అయ్యాడు. 

రెండో సినిమాగా ప్రేమం తీశాడు. కేర‌ళ‌లో ఆ సినిమా మ‌రో దిల్‌వాలే దుల్హానియా లేజాయింగే అనిపించుకొంది ప్రేమం. ఆ రేంజ్‌లో హిట్ట‌యింది. దాన్ని తెలుగులో చందూ తీసిన విధానికి క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఒరిజిన‌ల్ సినిమా చూసిన‌వాళ్లు చందూ చెడ‌గొట్టాడ‌న్నారు. చూడ‌ని వాళ్ల‌కి న‌చ్చింది. ఓవ‌రాల్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ అయింది.

కానీ ఆయ‌న‌కి నిజ‌మైన రెండో సినిమా..స‌వ్య‌సాచి (ప్రేమం రీమేక్ కాబ‌ట్టి). కానీ చందూ మొండేటి రెండో సినిమాతోనే తేల్చాశాడు త‌న ప్ర‌తిభ లిమిటెడ్ అని. ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్ అనే కాన్సెప్ట్‌తో తీసి సెకండ్ సినిమా సిండ్రోమ్‌ని చూపించాడు. చందూ మొండేటి ఈ సినిమాలో అత‌ను చూపిన డైర‌క్ష‌న్ స్కిల్స్‌తో ఒక్కసారిగా అందరిలో డౌట్స్ మొద‌లయ్యాయి. అతుకుల బొంత సీన్లుతో త‌న టాలెంట్‌ని త‌నే త‌క్కువ చేసుకున్నాడు. చందూ మ‌ళ్లీ నిఖిల్‌తో కార్తీకేయ 2 చేసుకుంటాడా?