టాలీవుడ్ లో మారుతోన్న కాంబినేషన్లు

Changes in different combinations
Thursday, February 27, 2020 - 08:15

మొన్న ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అనుకుంటే ...మర్నాడు ఆ కాంబినేషన్ లో మూవీ ఉండట్లేదు అని క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఎవరూ ఊహించని మరో కాంబినేషన్ సెట్ అవుతోంది. టాలీవుడ్ లో వేగంగా కాంబినేషన్ లు మారుతోన్నాయి. మహేష్ - సుకుమార్ సినిమా అనుకుంటే.. అది మారిపోయింది. సుకుమార్ బన్నీ తో సినిమా మొదలు పెట్టాడు. బన్నీ - వేణు శ్రీరామ్ ల "ఐకాన్" ఆఫిసియల్ గా ప్రకటన వచ్చింది. అది కూడా ఆగింది. వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ సెట్ అయింది. 

ఇక లేటెస్ట్ గా వంశీ పైడిపల్లి - మహేష్ బాబు కాంబినేషన్ లో మరో మూవీ అని నిర్మాతలు, అభిమానులు అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, స్క్రిప్ట్ నచ్చకపోవడంతో మహేష్ దాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆ స్థానంలో మూవీ సెట్ చేసేందుకు ఆల్రెడీ రకరకాల చర్చలు షురూ చేసారు మహేష్. త్వరలోనే ఒక ఆఫిసియల్ స్టేట్మెంట్ వస్తుంది. ఇక ప్రభాస్ - సందీప్ వంగ కాంబినేషన్ లో నెక్స్ట్ మూవీ అని అందరూ ఫిక్స్ అయ్యారు కానీ ప్రభాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ కి మూవీ ఓకె చేశాడు. అది ఈ ఏడాది చివర్లో మొదలవుతుంది.

 నాగ చైతన్య హీరోగా సినిమాని ప్రకటించాడు పరశురామ్. ఈ గీత గోవిందం దర్శకుడికి సడెన్ గా ఇప్పుడు మహేష్ బాబు నుంచి పిలుపు వచ్చింది. 

 ఇక రామ్ చరణ్ కూడా ఒక "సర్ప్రైజ్" కాంబినేషన్ ని అనౌన్స్ చేస్తాడట. ఇంకా చాలా చేంజెస్ జరుగుతోన్నాయి.