ఛార్మి వీడియో వైరల్

Charmee's fun video goes viral
Monday, March 2, 2020 - 14:30

విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. అయితే వాటితో పాటు ఇప్పుడు ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. అది చార్మికి సంబంధించిన వీడియో.

ముంబయిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అది కూడా మిడ్-నైట్ షూట్. దీంతో చార్మికి రెస్ట్ దొరకడం లేదు. అందుకే సెట్స్ లోనే తన అసిస్టెంట్ తో మసాజ్ చేయించుకుంది. అక్కడే ఉన్న ఓ యూనిట్ సభ్యుడు ఈ తతంగాన్ని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిర్మాతల కష్టాలు ఇలా ఉంటాయంటూ ట్వీట్ చేసింది చార్మి. అంతేకాదు, మసాజ్ చేస్తున్నంత సేపు ఇక షూటింగ్ చాలు, ప్యాకప్ చెప్పేయాల్సిందేనంటూ సణుగుతూ ఉంది. పక్కనే నిల్చుకున్న పూరి జగన్నాధ్ ఓవైపు షాట్ కు ఏర్పాట్లు చేసుకుంటూనే, మరోవైపు చార్మిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు.