వెరైటీగా స్వాతి పెళ్లి ఆహ్వాన ప‌త్రిక!

Check out the wedding invitation of Colors Swathi
Monday, August 13, 2018 - 14:30

క‌ల‌ర్స్ స్వాతి పెళ్లి చేసుకోబోతోంది. ఒక పైలట్‌ని ప్రేమించింది. కేర‌ళ‌కి చెందిన వికాస్ అనే పైలెట్‌ని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. ఈ నెల 30న హైద‌రాబాద్‌లో పెళ్లి. ఆమె పెళ్లి ప‌త్రిక‌ని వెరైటీగా డిజైన్ చేయించుకొంది. పాత‌కాలం హాలీవుడ్ సినిమా పోస్ట‌ర్స్ త‌ర‌హాలో సేవ్ ది డేట్ అంటూ పెళ్లి రోజు, రిసెప్స‌న్ డేట్స్‌ని ప‌త్రిక‌లో ప్రచురించారు.

ఈ నెల 30న ఆమె పెళ్లి. వేదిక మాదాపూర్‌లోని ఎన్ క‌న్వెన్స‌న్‌. ఇక రిసెప్స‌న్ వ‌రుడు వికాస్ సొంత సిటీలో. కొచ్చిలో సెప్టెంబ‌ర్ 2న పెళ్లి రిసెప్స‌న్‌.

స్వాతిరెడ్డి చాలా కాలంగా తెలుగు సినిమాల్లో న‌టించ‌డం లేదు. గ‌త నాలుగు, ఐదు ఏళ్లుగా ఆమె తమిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లోనే ఎక్క‌వ సినిమాలు చేసింది. కేర‌ళ‌కి రెగ్యుల‌ర్‌గా ప్ర‌యాణిస్తున్న టైమ్‌లోనే ఈ పైలట్ ప‌రిచ‌యం అయ్యాడ‌ట‌. ఆ ప‌రిచ‌యం స్నేహంగా మారి, ఆ త‌ర్వాత ప్ర‌ణ‌యంగా రూపొంతారం చెందింది. ఇపుడు ప‌రిణ‌యంగా మారుతోంది.