క్యాజువల్ గా చెప్పేసిన ఆచార్య

Chiranjeevi announces Acharya title
Sunday, March 1, 2020 - 23:15

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాకి "ఆచార్య" అనే టైటిల్ ఫిక్స్ అయింది అని తెలుగుసినిమా.కామ్ రెండు నెలల క్రితం పబ్లిష్ చేసింది. ఐతే, ఆ టైటిల్ ని ఇప్పటివరకు మేకర్స్ ప్రకటించలేదు. తాజాగా చిరంజీవి దాన్ని క్యాజువల్ గా చెప్పేశారు. బ్రహ్మాజీ కుమారుడు హీరోగా రూపొందుతోన్న 'ఓ పిట్ట కథ' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ తన సినిమా పేరును యధాలాపంగా చెప్పి తర్వాత... అయ్యో టైటిల్ ని ఇంకా అఫిషియల్ గా ప్రకటించలేదు అని గ్రహించారు. అయితే , ఇక ఇప్పుడు దాచుకునేదేమి లేదు.

ఈ సినిమాలో మెగాస్టార్ ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారు. ఒక కీలకమైన పాత్రకి మహేష్ బాబుని అడుగుతున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు లో కానీ, అక్టోబర్ లో విడుదల చెయ్యాలనేది ప్లాన్. 

చిరంజీవి సరసన త్రిష హీరోయినుగా నటించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.