చిరు బర్త్ డే గిఫ్ట్ అదేనా!

Chiranjeevi birthday specia
Monday, August 3, 2020 - 22:15

మెగాస్టార్ అప్ కమింగ్ సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంది. సుజీత్, బాబి, త్రివిక్రమ్, వీవీ వినాయక్, మెహర్ రమేష్.. ఇలా చాలా మంది దర్శకుల పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. వీళ్లలో సుజీత్, బాబి, త్రివిక్రమ్ పేర్లను స్వయంగా చిరంజీవి వెల్లడించారు.

అయితే ప్రస్తుతం చేస్తున్న "ఆచార్య" సినిమా తర్వాత చిరంజీవి ఏ మూవీని సెట్స్ పైకి తీసుకొస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. చిరంజీవి పుట్టినరోజు వేదికగా ఈ సస్పెన్స్ కు తెరపడబోతోంది.

ఈనెల 22న తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి కొత్త సినిమా ప్రకటన రాబోతోంది.

"లూసిఫర్" రీమేక్ ను ఆ రోజున అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు బాబి దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమా ప్రకటన కూడా వస్తుందంటున్నారు చాలామంది. చిరంజీవి-బాబి కాంబినేషన్ మూవీని కొణెదల ప్రొడక్షన్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉంది. ఈ మేరకు చిరంజీవి పుట్టినరోజు నాడు మైత్రీ సంస్థ నుంచి ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒక సినిమాను 22న అధికారికంగా ప్రకటించడం ఖాయం. దీంతో పాటు "ఆచార్య" టైటిల్ ను కూడా ఈ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.