చిరు డాక్యూమెంటరీ

Chiranjeevi life in a documentary?
Friday, April 17, 2020 - 17:15

మెగాస్టార్ చిరంజీవి ఆటోబయోగ్రఫీ (ఆత్మకథ) రాసుకుంటున్నారు అని తెలుగుసినిమా. కామ్ ఇంతకుముందే చెప్పింది. ఇప్పుడు ఇంకో అప్డేట్ ఈ విషయంలో. డాక్యుమెంటరీగా కూడా విడుదల చేసే ఉందట. చిరంజీవి దగ్గర బోలెడన్ని వీడియోస్, ఫొటోస్ ఉన్నాయి.... అయన జీవితానికి సంబంధించి. సో డాక్యుమెంటరీ తీయడం సులువే. 

మరి బయోపిక్ సంగతి? తన జీవితంలో బయోపిక్ తీసేంత ఎమోషన్స్, ట్విస్టులే లేవని అంటున్నారు చిరంజీవి. సినిమా తీయాలంటే సన్నివేశాల్లో ఎమోషన్స్ ఉండాలని, ట్విస్టులు కూడా ఉండాలని.. తన జీవితంలో కానీ కెరీర్ లో కానీ ఆ రేంజ్ ఎత్తుపల్లాలు లేవంటున్నారు మెగాస్టార్. కాబట్టి బయోపిక్ వచ్చే ఛాన్స్ లేదని స్పష్టంచేశారు.

నిజమే.. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త ఇబ్బంది పడిన చిరంజీవి.. ఖైదీ సినిమా నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మినిమం గ్యాప్స్ లో సూపర్ హిట్స్ ఇస్తూనే ఉన్నారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఒక టైమ్ లో చిరంజీవి ఫ్లాప్ సినిమా తీసినా కాసుల వర్షం కురిసిందంటే ఆయన క్రేజ్ ను అర్థంచేసుకోవచ్చు.