చిరుని ఇరుకున పెట్టిన కాజ‌ల్‌

Chiranjeevi is the most romantic person I have worked with: Kajal
Monday, April 9, 2018 - 15:15

మెగాస్టార్ చిరంజీవి కొంత ఇబ్బంది ప‌డే కామెంట్ చేసింది అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

మెగాస్టార్‌కిపుడు 60 ప్ల‌స్‌. ఆయ‌న కొడుకు టాప్ హీరోల్లో ఒక‌రిగా కంటిన్యూ అవుతున్నాడు. చిరంజీవి ఈ వయ‌సులోనూ ఖైదీ నెంబ‌ర్ 150లో అద‌ర‌గొట్టాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే చిరుని ఇపుడు రొమాంటిక్ హీరోగా ఎవ‌రూ ప‌రిగ‌ణించారు. ఆయ‌న‌కున్న సీనియారిటీ, వ‌య‌సుని బ‌ట్టి అంద‌రూ హుందాత‌నానికి ప్ర‌తిరూపం అనో, మంచి మ‌నిషి అనో, గ్రేట్ యాక్ట‌ర్ అనో చెపుతారు. కానీ చిరంజీవినిని మోస్ట్ రొమాంటిక్ ప‌ర్సన్ అని ఇపుడు ఒక హీరోయిన్ అంటే ఎలా ఉంటుంది? చిరు కూడా ఇబ్బందిప‌డే స్టేట్‌మెంట్ అది.

జీటీవీ నిర్వ‌హించిన అప్స‌ర అవార్డుల కార్య‌క్ర‌మంలో హీరోల గురించి త‌న అభిప్రాయాన్ని చెప్పింద‌ట‌ ఈ భామ‌. తాను వ‌ర్క్ చేసిన హీరోల్లో అంద‌రి క‌న్నా రొమాంటిక్ ప‌ర్స‌న్ చిరంజీవి అని కాజ‌ల్ కామెంట్ చేసింద‌ట‌. ఆమె ఉద్దేశం పాజిటివే కానీ అది ఎంతైనా.. యువ హీరోల‌ని కాద‌ని చిరంజీవి ఆ కేట‌గిరీలో ఓటేయ్య‌డం అంటే ఎంతైనా..అద‌న్న‌మాట‌...

చాలామంది హీరోలతో వర్క్ చేశాను కానీ చిరంజీవి అంత రొమాంటిక్ గా నాకు ఎవరూ కనిపించలేదని మెగాస్టార్ గురించి గొప్పగా చెప్పింది. చిరంజీవి స‌ర‌స‌న ఆమె ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో న‌టించింది. ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్‌.