శుభాకాంక్షల్లో ఇది చిరు స్టయిల్

Chiranjeevi wishes Akhil, Allu Arjun and Akira a happy birthday
Wednesday, April 8, 2020 - 15:00

ఈరోజు ఒకేసారి ముగ్గురు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. వాళ్ల ముగ్గురికి తనదైన స్టయిల్ లో శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. వాళ్ల ముగ్గురే అల్లు అర్జున్, అఖిల్, అకిరా.

బన్నీ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ చిన్నప్పటి ఫొటోను షేర్ చేశారు చిరు. అందులో చిరంజీవి కూడా ఉన్నారు. డాన్స్ లో గ్రేస్ ఆ వయసు నుంచే ఉందని, బన్నీలో కసి, కృషి అంటే తనకు చాలా ఇష్టమంటూ శుభాకాంక్షలు అందించారు చిరు.

ఇక అఖిల్ కు సంబంధించి కూడా చిన్ననాటి ఫొటో షేర్ చేశారు. చరణ్ కు ఒక తమ్ముడు, సురేఖకు నాకు కొడుకు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ పోస్ట్ చేశారు.

అయితే బన్నీ, అఖిల్ ను మెచ్చుకోవడం ఒకెత్తయితే.. పవన్ కల్యాణ్ కొడుకు అకిరాను మెచ్చుకోవడం మరో ఎత్తు. అకిరాను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన చిరు.. "మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే  మించిపోవాలి.Wish you a "Power"ful future. Happy Birthday Akira" అంటూ పోస్ట్ పెట్టి అందర్నీ ఎట్రాక్ట్ చేశారు.