కొరటాల కోసం చిరు వర్కవుట్స్

Chiranjeevi working out for Koratala Siva's film
Friday, November 8, 2019 - 18:00

ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్న స్టిల్ ఇది. చిరంజీవి వర్కవుట్స్ చేస్తుండగా తీసిన ఫొటో ఇది. కొరటాల సినిమా కోసమే చిరంజీవి ఇలా స్లిమ్ అవుతున్నాడనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో చిరంజీవి కనిపించబోతున్నాడనే టాక్ ఉంది. వీటిలో ఓ గెటప్ కోసం చిరంజీవి ఇలా మేకోవర్ అవుతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే త్రిషను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. గతంలో త్రిష-చిరు కాంబోలో స్టాలిన్ వచ్చింది. అందులో చిరంజీవి  సరసన త్రిష మరీ చిన్నగా కనిపించింది. ఆ జోడీకి పెద్దగా మార్కులు పడలేదు. కట్ చేస్తే, త్రిష ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. అందుకే చిరంజీవి కాస్త తగ్గే పనిలో కసరత్తులు షురూ చేశారు. పైగా క్యారెక్టర్ పరంగా కూడా చిరంజీవి తగ్గడం అవసరం.  

కొరటాల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. రైతుల సమస్యను ఇతివృత్తంగా తీసుకున్నారట. నక్సలిజం అంశాన్ని కూడా టచ్ చేశారట. లెక్కప్రకారం, సినిమాలో ఆచార్య, గోవింద్ అనే రెండు పాత్రల్లో చిరంజీవి  కనిపించాలి. ఇప్పుడు ఈ రెండు పాత్రల్లో ఒక పాత్రను రామ్ చరణ్ తో చేయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ పాత్ర వస్తుందట.