ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ వాయిదా

Chiru to unveil SV Ranga Rao's statue
Saturday, August 24, 2019 - 14:15

విశ్వ నట చక్రవ‌ర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది.  తాడేప‌ల్లి గూడెంలో ఈ నెల 25న చిరంజీవి చేతుల మీదుగా  విగ్రహాన్ని ఆవిష్కరించాలని  భావించారు. కానీ, కొన్ని అనివార్య కారణాలవల్ల దీనిని వాయిదా వేశామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాలేదని చెప్పారు.

త్వ‌ర‌లోనే కొత్త తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు.