మూడు నెల‌ల త‌ర్వాత గొంతు విప్పిన దాస‌రి

Chiru wishes Dasari Narayana Raon on his birthday
Thursday, May 4, 2017 - 19:15

దాస‌రి నార‌య‌ణ‌రావు బ‌ర్త్‌డే సంబ‌రాలు (మే 4) ఘ‌నంగా జ‌రిగాయి. మూడు నెల‌ల పాటు ఆయ‌న హాస్పిట‌ల్‌లో చికిత్స పొందారు. ఇపుడు పూర్తిగా కోలుకున్నారు. చిరంజీవి ఆయ‌న ఇంటికి వెళ్లి బ‌ర్త్‌డే విషెష్ తెల‌ప‌డ‌మే కాదు అల్లు రామ‌లింగ‌య్య అవార్డు కూడా అంద‌చేశారు. "మూడు నెలలు అయ్యింది గొంతు విప్పి ..ఈ రకం గా మాట్లాడటం చాలా ఆనందం గా ఉంద‌న్నారు దాస‌రి.

"నేను స్టేజ్ పైకి వచ్చి ఈ అవార్డ్ అందుకోవాల్సింది...నా బదులు చిరంజీవి అందుకొని పుట్టిన రోజు నాడు ఇవ్వడం ఆనందంగా ఉంది. నాకు ఇంత‌వ‌ర‌కు వ‌చ్చిన అవార్డ్ వేరు, ఇది వేరు. ఇది నా సొంత మనుషుల అవార్డ్...నేను దర్సకత్యం వహించిన 100 సినిమా లో అల్లు రామ‌లింగ‌య్య న‌టించారు. రామలింగయ్య లేకుండా నేను ఎప్పుడు కధ రాసుకోలేదు. కొంత మందికి ఇండస్ట్రీలో రీప్లేస్ లేదు. అటువంటి వారిలో  అల్లు రామలింగయ్య, ఎస్వీ రంగారావు, సూర్య‌కాంతం ఉన్నా"రన్నారు దాస‌రి. 
.
 హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఖైదీ నెంబ‌ర్ 150  టోటల్ కలెక్షన్స్ ఎంత అని పేపర్ మీద రాసి అడిగారు దాస‌రి.  ఇప్పటివరకు అదే రికార్డ్ అని చెప్పడం జరిగింది.   ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఆయ‌న స‌మ‌క్షంలో జ‌రిగింది. అందుకే 100 రోజుల వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించాం. ఆయ‌న స‌రే అన‌డం ఆనందంగా ఉంది అని చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేశారు.