యూట్యూబ్ లో చెప్పి చేసుకుంటా: హన్సిక

Chit chat with Hansika during quarantine period
Thursday, April 16, 2020 - 22:30

హన్సిక క్వారంటైన్ చిట్ చాట్

లాక్ డౌన్ టైమ్ లో అందర్లానే హన్సిక కూడా ఇంటికే పరిమితమైంది. ఇన్నాళ్లూ ఎక్సర్ సైజ్, యోగా, కుకింగ్ కే పరిమితమైన ఈ ఆపిల్ పిల్ల... ఈ క్వారంటైన్ టైమ్ లో ఫస్ట్ టైమ్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ శింబుతో పాటు.. తను చేస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ ముచ్చట్లు బయటపెట్టింది.

ప్రేమించేవాడు ఎలా ఉండాలి?
నన్ను ప్రేమించేవాడు మంచోడైతే చాలు. బాగా ప్రేమించే మనసుంటే చాలు.

ఇష్టమైన వంటకాలు ఏంటి?
అమ్మ పంజాబీ.. పైగా పూర్తిగా వెజిటేరియన్.. కాబట్టి ఆమె వండే వంటకాల్లో పూర్తిగా నెయ్యి, బట్టర్ వాడుతుంది. అందుకే నా ఫేస్ లో కూడా మీరు బట్టర్, నెయ్యి చూడొచ్చు.  

శింబు గురించి ఏమైనా చెప్పండి.. ఇప్పటికీ ఫ్రెండ్ గానే ఉన్నాడా?
ఇంకా శింబు గురించి అడుగుతున్నారు. పర్సనల్ విషయాలు మాట్లాడ్డం ఇష్టం ఉండదు. కానీ ఇంకోసారి చెబుతున్నాను. శింబు నాకు మంచి ఫ్రెండ్. ఒకప్పుడు అతడు నా బాయ్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు ఇద్దరం మంచి స్నేహితులం. ఎక్స్-లవర్స్ స్నేహితులుగా మారొచ్చు కదా.

కొత్త వీడియో ఎప్పుడు?
త్వరలోనే నా క్వారంటైన్ వీడియో వస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే శనివారమే వస్తుంది. నా వీడియో నేనే షూట్ చేసుకున్నాను. కాకపోతే ఎడిటింగ్ మాత్రం నా టీమ్ చేసింది. నా క్వారంటైన్ విశేషాలన్నీ అందులో ఉంటాయి.

చాలా పెయింటింగ్స్ వేశారాంట.. ?
నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. ఇప్పటికే కొన్ని పెయింటింగ్స్ వేశాను. 3 రోజుల కిందట కూడా ఒకటి పూర్తిచేశాను. చాలామంది నా పెయింటింగ్స్ తో ఎగ్జిబిషన్ పెట్టమంటున్నారు. కానీ ఎగ్జిబిషన్ పెట్టేంత పెయింటింగ్స్ లేవు. కానీ నా పిల్లల కోసం (దత్తత తీసుకున్న) ఎగ్జిబిషన్ పెడతాను. అది కూడా ఛారిటీ కోసం మాత్రమే.

కొత్త వెబ్ సిరీస్ ఎక్కడివరకు వచ్చింది?
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా నేను చేయాల్సిన వెబ్ సిరీస్ వాయిదా పడింది. కానీ ఈ ఏడాదిలోనే ఉంటుంది. ఇది స్ట్రయిట్ తెలుగు సిరీస్. ప్రస్తుతానికి నషా అనే టైటిల్ అనుకుంటున్నాం. థ్రిల్లర్, హారర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సిరీస్ ను జి.అశోక్ డైరక్ట్ చేస్తాడు. ఇది 10 ఎపిసోడ్స్ సిరీస్. నాతో పాటు అశుతోష్ రాణా నటిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే నషా వస్తుంది.

ఫేవరెట్ హాలిడే స్పాట్స్?
లండన్, న్యూయార్క్, మాల్దీవులు నా ఫేవరెట్ డెస్టినేషన్స్. వీటిలో లండన్, న్యూయార్క్ కు మాత్రం ఈ ఏడాది వెళ్లలేను.

పెళ్లి ఎప్పుడు?
ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే అప్పుడు కచ్చితంగా నా యూట్యూబ్ ఛానెల్ లో చెప్పి మరీ చేసుకుంటాను.