సుకుమార్ సినిమాకి టైటిల్ అది కాదు!

Clarification on Sukumar movie title
Monday, January 20, 2020 - 12:00

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్వకత్వంలో ఇటీవలే ఒక కొత్త మూవీ మొదలైంది. అల్లు అర్జున్ ఇంకా షూటింగ్లో పాల్గొనడం లేదు కానీ సుకుమార్ ఇతర సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ... తిరుపతి చుట్టుపక్కల కల శేషాచలం అడవుల నేపథ్యంగా రూపొందుతోంది. దాంతో ఈ మూవీకి "శేషాచలం" అనే పేరుని ఖరారు చేసినట్లు ప్రచారం మొదలైంది. "రంగస్థలం" హిట్ అయింది కాబట్టి అదే పంథాలో  టైటిల్ పెడుతున్నారేమో అని భావించారు అంతా. నిజానికి ఈ కథకి ఈ టైటిల్ నప్పుతుంది. 

శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం దొంగతనం చేసే స్మగ్లర్ల గురించి ఈ కథ.  అయితే, ఈ టైటిల్ ఫిక్స్ కాలేదు అని, సోషల్ మీడియాల్లో, మీడియాల్లో వచ్చిన ప్రచారంలో నిజం లేదంటోంది టీం. టైటిల్ ఖరారు అవ్వగానే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారట. ఖరారు అయిన తర్వాత ప్రకటించకుండా ఫ్రిజ్ లో దాచుకుంటారా?

అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న మూవీ ఇది.