సింపుల్‌గా వెడ్డింగ్‌...క‌ల‌ర్స్ స్వాతి ఆలోచ‌నే

Colors Swathi weds Vikas in simple ceremony
Saturday, September 1, 2018 - 09:30

క‌ల‌ర్స్ స్వాతి పెళ్ల‌యింది. మ‌రి మీడియాలో హంగామా, ఒక సెల‌బ్రిటీ పెళ్లికుండే క‌వ‌రేజ్ రాలేదేంటి? ఎందుకంటే ఆమె పెళ్లి చాలా సింపుల్‌గా, సెల‌బ్రిటీ కాని సాధార‌ణ అమ్మాయి వివాహ వేడుక‌లానే జ‌రిగింది. మీడియాని ఆహ్వానించ‌లేదు. సెల‌బ్రిటీల‌నెవ్వ‌రినీ పిల‌వ‌లేదు. కేవ‌లం కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో పెళ్లి వేడుక జ‌రిగింది.

గురువారం రాత్రి హైద‌రాబాద్‌లో ఆమె పెళ్లి చేసుకొంది. కేర‌ళ‌కి చెందిన పైల‌ట్ వికాస్‌ని పెళ్లాడింది. ప్రేమ పెళ్లి. సాధార‌ణంగా సినిమా తార‌ల పెళ్లి అంటే ఓ రేంజ్ హంగామా ఉంటుంది. అదంతా ఉండొద్ద‌ని, పెళ్లి వేడుక కుటుంబ స‌భ్యుల సంబ‌రంగా ఉండాల‌నేది నా ఆలోచ‌న, అందుకే సింపుల్‌గా చేసుకుంటున్నాని క‌ల‌ర్స్ స్వాతి ఒక ప‌త్రిక‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పింది. 

డేంజ‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై తెలుగులో ఎన్నో హిట్ సినిమల్లో న‌టించిన అచ్చ తెలుగు భామ‌..క‌ల‌ర్స్ స్వాతి. టీవీ యాంక‌ర్‌గా కెరియ‌ర్ మొద‌లుపెట్టి..త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లోనూ న‌టించింది. పెళ్లి త‌ర్వాత కూడా న‌టిస్తాన‌ని చెపుతోంది కానీ తెలుగులో అయితే ఆమెకి చాలా కాలంగా ఆఫ‌ర్లురావ‌డం లేదు. కోలీవుడ్‌, మాలీవుడ్‌ల‌లో ఛాన్స్‌లుంటాయి.