ఓటీటీ ఎట్రాక్షన్స్ ఇవే

The coming attractions on OTT platforms
Wednesday, April 15, 2020 - 13:30

అదేంటి లాక్ డౌన్ టైమ్ లో రిలీజ్ అని ఆలోచిస్తున్నారా.. పైగా లాక్ డౌన్ పీరియడ్ ను పొడిగించిన తర్వాత అప్ కమింగ్ రిలీజెస్ ఏముంటాయనుకుంటున్నారా.. ఇప్పుడంతా ఓటీటీ మీద ఫోకస్. ఇందులో భాగంగా ఓటీటీలో త్వరలోనే రిలీజ్ కాబోతున్న 4 సినిమాలేంటో చూద్దాం.

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఈరోజే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాను సన్ నెక్ట్స్ యాప్ లో స్ట్రీమింగ్ కు పెట్టారు. అంతేకాదు.. సేమ్ టైమ్ నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇది ప్రత్యక్షమైంది. నిజానికి ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. కానీ ఓటీటీలో మంచి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది లాక్ డౌన్ టైమ్. అంతా ఇళ్లకు అతుక్కుపోయి ఉన్నారు. కాబట్టి వరల్డ్ ఫేమస్ లవర్ పై సన్ నెట్ వర్క్ మంచి హోప్స్ పెట్టుకుంది.

అంతేకాదు.. ఇదే ఊపులో మరో కొత్త సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ కు రెడీ చేసింది. దాని పేరు అశ్వథ్థామ. నాగశౌర్య-మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమాను 17వ తేదీన (వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చిన 2 రోజులకు) స్ట్రీమింగ్ కు పెట్టాలని నిర్ణయించింది. ఓవర్సీస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కూడా జోడిస్తున్నారు.

మరోవైపు ఈ ఏడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన భీష్మ కూడా ఓటీటీలోకి రాబోతోంది. ఇది కూడా సన్ నెక్ట్స్ లోనే రాబోతోంది. ఈ సూపర్ హిట్ మూవీని ఈనెల 24న స్ట్రీమింగ్ కు పెట్టాలని నిర్ణయించింది సదరు సంస్థ. దీంతో పాటు కనులు కనులు దోచాయంటే అనే సినిమా కూడా ఈనెల 17న నెట్ ఫ్లిక్స్ లో రాబోతోంది.