ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి లేనట్టే

Corona affects Prabhas wedding plans?
Thursday, July 16, 2020 - 12:00

బాహుబలి-2 థియేటర్లలోకి వచ్చిన వెంటనే పెళ్లి అనుకున్నారు. సాహో ప్రాజెక్టు చాన్నాళ్లుగా లేట్ అవుతుంది కాబట్టి అది పూర్తిచేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాడని అనుకున్నారు. కానీ సాహో విడుదలై ఇన్నాళ్లైనా ప్రభాస్ ఇంకా ఓ ఇంటివాడు కాలేదు. ఈసారి అతడి పెళ్లికి కరోనా అడ్డుగా నిలిచిందంటున్నారు ఈ హీరో సన్నిహితులు.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడట ప్రభాస్. ఈ మేరకు కృష్ణంరాజు అన్నీ ప్లాన్ చేసి పెట్టారట. కానీ కరోనా/లాక్ డౌన్ కారణంగా ఇంకొన్నాళ్లు పెళ్లి వాయిదా వేయాలని ప్రభాస్ కోరాడట. అలా ఈ ఏడాది కూడా పెళ్లికి దూరమయ్యాడు ప్రభాస్.

నిజానికి కరోనా/లాక్ డౌన్ ఉన్నప్పటికీ చాలామంది సినీ ప్రముఖులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే కృష్ణంరాజు మాత్రం గ్రాండ్ గా పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకే ప్రభాస్ పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారట. ప్రభాస్ కోసం ఆల్రెడీ ఓ సంబంధం రెడీగా ఉందనేది అతడి సన్నిహితులు చెబుతున్న మాట.