నితిన్ కు భలేగా కలిసొచ్చింది

Coronavirus break is a blessing to Nithin!
Monday, July 27, 2020 - 12:30

దుబాయ్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వచ్చి సినిమా సెట్స్ పై వాలిపోవాలనేది నితిన్ ప్లాన్. ఎందుకంటే పెళ్లి తర్వాత హనీమూన్ అంటూ గ్యాప్ తీసుకునే పరిస్థితి లేదు ఈ హీరోకు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 4 సినిమాలు లైన్లో పెట్టాడు. అందుకే జస్ట్ పెళ్లి తతంగం కానిచ్చేసి సెట్స్ పైకి వచ్చేయాలనేది ఒరిజినల్ ప్లాన్. 

కానీ లాక్ డౌన్ కారణంగా నితిన్ ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. అతడి సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. దుబాయ్ లో అనుకున్న పెళ్లి హైదరాబాద్ లో చేయాల్సి వచ్చింది. ఇలా ఇన్ని విషయాలు తన చేజారినా ఒక విషయంలో మాత్రం నితిన్ ఫుల్ హ్యాపీ. అదే గ్యాప్.

పెళ్లి తర్వాత నితిన్ కు అనుకోని విధంగా ఇప్పుడు టైమ్ కలిసొచ్చింది. విదేశాలకు వెళ్లకపోయినా తన భార్యతో కలిసి ఇంట్లోనే క్వాలిటీ టైమ్ గడిపే వీలుచిక్కింది. సినిమా షూటింగ్స్ లేకపోవడంతో నితిన్-షాలినీ ఇద్దరికీ ఇల్లే హనీమూన్ స్పాట్ గా మారింది.  

సినిమాలు ఆగిపోయి హీరోలంతా కెరీర్ లో గ్యాప్ వచ్చేసిందని బాధపడుతుంటే నితిన్ కు మాత్రం ఈ గ్యాప్ భలేగా కలిసొచ్చింది.