బుట్టకి టిక్ టాక్లో యమా క్రేజ్

Craze for Butta Bomma dance steps in Tik Tok
Saturday, February 8, 2020 - 17:30

ఇప్పుడు యూట్యూబ్ వ్యూస్ తో పాటు టిక్ టాక్లో క్రేజ్ ని కూడా హీరోలు బాగా పట్టించుకుంటున్నారు. ఒక పాట టిక్ టాక్ లో బాగా వైరల్ అయింది అంటే... అది అంతగా జనంలోకి వెళ్ళింది అన్నమాట. తాజాగా... "అల వైకుంఠపురంలో" మూవీలోని 'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే" అనే పాటలో బన్నీ చేసిన డాన్స్ స్టెప్ కి టిక్ టాక్ లో బాగా క్రేజ్ పెరిగింది. 

"తమిళ, మలయాళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ ను టిక్ టాక్ చేశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ ను టిక్ టాక్ చేసి చేసింది, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాంగ్ ఎంతటి పావులర్ అయ్యిందో. బుట్టబొమ్మ సాంగ్ కి టిక్ టాక్ లో  దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం," అని బన్నీ టీం ఆనందంగా చెప్తోంది. 

టిక్ టాక్ లో ఒక పాటకి డబ్ మాష్ చెయ్యడం, డాన్స్ చెయ్యడం అనేది హాట్ ట్రెండ్ ఇప్పుడు.