మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది

Cricketer Manish Pandey marries an actress
Tuesday, December 3, 2019 - 06:45

మొన్న హీరోయిన్ అర్చన అలియాస్ వేద పెళ్లి చేసుకుంది. నిన్న మరో హీరోయిన్ మనాలీ రాధోడ్ పెళ్లి చేసుకుంది. ఇంకో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. కన్నడలో పలు సినిమాల్లో నటించిన అశ్రిత షెట్టి లైఫ్ లో సెటిల్ అయింది. ఈమె పెళ్లి చేసుకున్నది ఎవర్నో తెలుసా..? అక్షరాలా ఇండియన్ క్రికెట్ మనీష్ పాండేను.

అవును.. మనీష్ పాండే, అశ్రిత షెట్టి ఈరోజు పెళ్లి చేసుకున్నారు. ముంబయిలో సంప్రదాయపద్ధతిలో వీళ్ల వివాహం జరిగింది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు మనీష్. ఆ జట్టు సభ్యులంతా ఈ వివాహానికి హాజరయ్యారు. అటు శాండిల్ వుడ్ నుంచి అశ్రిత క్లోజ్ ఫ్రెండ్స్, హీరోలు కొంతమంది హాజరయ్యారు. ఇలా ఇటు క్రికెటర్లు, అటు సినీతారలతో వీళ్ల పెళ్లి కలర్ ఫుల్ గా జరిగింది.

2012లో కన్నడి చిత్రసీమలో ఎంటరైంది అశ్రిత. కన్నడలో 2 సినిమాలు, తమిళ్ లో 2 సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళ్ లో ఆమె నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా పూర్తి చేసి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే పరిమితమవ్వాలని ఈమె నిర్ణయించుకుంది. మనీష్-అశ్రిత దాదాపు పదేళ్లుగా ఒకరికొకరు పరిచయం. కొన్నాళ్లుగా వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు.