తండ్రిని కోల్పోయిన హీరోయిన్

ctress Amala Paul's father passes away
Wednesday, January 22, 2020 - 14:00

హీరోయిన్ అమలాపాల్ తన తండ్రిని కోల్పోయింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న 61 ఏళ్ల పాల్ వర్గేస్, నిన్న కన్నుమూశారు. ఈ విషయాన్ని అమలాపాల్ కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. తండ్రి మరణించిన టైమ్ లో అమలాపాల్ అక్కడ లేరు. తమిళ సినిమా "అదో అంధ పరవాయ్ పోలా" ట్రయిలర్ లాంఛ్ కోసం చెన్నై వెళ్లారు. తండ్రి మరణవార్త విన్న వెంటనే ఆమె హుటాహుటిన చెన్నై నుంచి కేరళకు వెళ్లారు. ఈరోజు కురుప్పంపాడిలోని సెయింట్ పీటర్స్ అండ్ సెయింట్ పాల్ చర్చిల్ అమలాపాల్ తండ్రి అంత్యక్రియలు లాంఛనంగా జరుగుతాయి.

అమలాపాల్ కు తండ్రి అంటే చాలా ఇష్టం. కేవలం ఆయన వద్దన్నారనే కారణంతో ఆమె చాన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఎట్టకేలకు సోదరుడు అభిజిత్ పాల్ సర్దిచెప్పడంతో వర్గేస్ ఒప్పుకున్నారు. అలా తండ్రి అనుమతితో సినిమాల్లోకి ఎంటరైన అమలాపాల్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తనకు గుర్తింపు వచ్చిన ప్రతిసారి తండ్రిని గుర్తుచేసుకున్న అమలాపాల్.. తను ఇలా నటిస్తున్నానంటే దానికి కారణం తన తండ్రి అని చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఆయన నో అంటే తను సినిమాల్లోకి వచ్చేదాన్ని కాదని ఎన్నోసార్లు చెప్పింది.