డమరుకం శ్రీనివాస్ రెడ్డికి పదవి

Damarukam Srinivasa Reddy gets post in Bhakti channel
Sunday, October 13, 2019 - 16:45

టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్లీ మొదలైంది, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, డమరుకం వంటి సినిమాలు తీసిన శ్రీనివాస రెడ్డి ఈ మధ్య  లైమ్ లైట్లో లేరు. అలాంటి దర్శకుడు ఉన్నట్లుండి వార్తల్లో నిలిచారు. ఆయనకీ ఒక పదవి వరించింది. మొన్నటి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస రెడ్డి .... వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ తరపున బాగా హడావుడి చేశారు. దాంతో, సీఎం జగన్ ఆయనికి ఒక పదవి ఇచ్చారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోన్న భక్తి ఛానల్ లో బోర్డు మెంబర్ గా శ్రీనివాస రెడ్డిని తీసుకున్నారు. ఈ ఛానల్ కి చైర్ పర్సన్ గా కమెడియన్ పృథ్వి ఆల్రెడీ ఎంపికయ్యారు. ఇప్పుడు శ్రీనివాస రెడ్డికి ఒక పదవి దక్కింది ఈ ఛానెల్లో. 

ఈషా రెబ్బ హీరోయిన్ గా ప్రస్తుతం ఆయన ...రాగల 24 గంటల్లో అనే సినిమా తీస్తున్నారు.