టీవీలో కూడా దర్బార్ తుస్సు

Darbar World Television premiere posts low TRP
Thursday, April 16, 2020 - 17:15

సాధారణంగా టీవీల్లో కొత్త సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకైతే మంచి టీఆర్పీలు వస్తాయి. కానీ ఈవారం వచ్చిన రేటింగ్స్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. దర్బార్ లాంటి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ కంటే సరైనోడు లాంటి రిపీటెడ్ సినిమాలకే ఎక్కువ రేటింగ్ రావడం విశేషం.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాను 10వ తేదీన టెలికాస్ట్ చేసింది జెమినీ ఛానెల్. ఈ సినిమా కోసం భారీగా ప్రచారం కూడా చేసింది. అలా గ్రాండ్ గా బుల్లితెరపైకొచ్చిన ఈ సినిమాకు కేవలం 6.89 (అర్బన్+రూరల్) టీఆర్పీ మాత్రమే వచ్చింది.

దర్బార్ సినిమా కంటే ఇప్పటికే ఎన్నోసార్లు టీవీల్లో వచ్చేసిన సరైనోడు సినిమాకు మంచి రేటింగ్ రావడం విశేషం. బన్నీ నటించిన ఈ సినిమాకు 7.94 (అర్బన్+రూరల్) టీఆర్పీ వచ్చింది. ఇక రేటింగ్స్ పరంగా మూడో స్థానంలో సంక్రాంతి, నాలుగో స్థానంలో జంగిల్ బుక్, ఐదో స్థానంలో సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలు నిలిచాయి.

ఎప్పట్లానే సంక్రాంతి సినిమా మరోసారి మంచి రేటింగ్ తెచ్చుకోగా.. సుడిగాలి సుధీర్ నటించిన సినిమాకు కూడా మంచి టీఆర్పీ రావడం విశేషం. బుల్లితెర వీక్షకులకు బాగా పరిచయమైన ఫేస్ కావడంతో సాఫ్ట్ వేర్ సుధీర్ కు మంచి రేటింగ్ (6.09) వచ్చింది. ఇక వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన అంజలి సీబీఐ అనే సినిమాకు (నయనతార లీడ్) చెప్పుకోదగ్గ స్థాయిలో టీఆర్పీ రాలేదు.