అప్పుడు లేవని నోళ్లు.... !

Dasari used to conduct meetings at his home
Saturday, May 30, 2020 - 15:00

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యవహరించేవారు. హీరోయిన్ ని హీరో గిల్లినా, దర్శకుడు రైటర్ కథ కాపీ కొట్టినా, నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్ కి గొడవైనా, చిన్నదో పెద్దదో... ఏ సమస్యా అయినా దాసరి పరిష్కరించేవారు. టాలీవుడ్ కి ఆయన పెదరాయుడు అప్పట్లో. మరి అన్ని మీటింగ్ లు దాసరి ఇంట్లోనే జరిగేవి. మెగాస్టార్ కావొచ్చు, అప్ కమింగ్ స్టార్ కావొచ్చు... అందరూ ఆయన ఇంటికి వెళ్లేవారు. 

మరి అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అని ప్రశ్నలు వేస్తున్నారు చిరంజీవి బ్యాచ్. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ బాగు కోసం స్వచ్చందంగా తన ఇంట్లో మీటింగ్ పెడితే తప్పు పట్టడం ఏంటి? అని అడుగుతున్నారు. కరోనా లక్డౌన్ లో ఛాంబర్  కానీ, హోటల్స్ కానీ ఓపెన్ లేవు. మరి అంత మంది కూర్చోవాలంటే పెద్ద ప్లేస్ కావాలి కదా. అందుకే చిరంజీవి మొదటి మీటింగ్ తన ఇంట్లో పెట్టారు... ఆ తర్వాత మీటింగ్స్ అన్ని  అన్నపూర్ణ స్టూడియోలో జరిగాయి. 

దాసరి ఇంట్లో మీటింగ్స్ ... నో పోలీస్ ...కానీ చిరంజీవి ఇంట్లో మీటింగ్ కి నోళ్లు లేస్తున్నాయే ..ఏం ? అంటూ బాలయ్య డైలాగ్ నే తిప్పికొడుతోంది చిరంజీవి బ్యాచ్.