ప్రభాస్ సినిమాకు డేట్ ఫిక్స్...నిజమేనా?

Date fixed for regular shoot of Prabhas's Saaho?
Friday, May 12, 2017 - 20:15

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అమెరికాలో ఉన్నాడు. ఓవైపు బాహుబలి-2 సినిమాకు వస్తున్న ప్రశంసల్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు రిలాక్స్ అవుతున్నాడు. పనిలోపనిగా తన కొత్త సినిమా కోసం అమెరికాలోనే మేకోవర్ అవుతున్నాడంటూ వార్తలు కూడా వస్తున్నాయి. సరే... ఈ పుకార్లను కాసేపు పక్కనపెడితే ప్రభాస్ అప్ కమింగ్ మూవీపై మరో హాట్ న్యూస్ బయటకొచ్చింది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సాహో సినిమా వచ్చేనెల 10 నుంచి సెట్స్ పైకి వస్తుందట. మేటర్ ఇంకా కన్ ఫర్మ్ కాకపోయినా.. ప్రస్తుతానికి ఇది ఫైనల్ అంటున్నాడు దర్శకుడు సుజీత్. ఈ మేరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ నెలాఖరుకు ప్రభాస్ అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే డేట్ లాక్ చేస్తామని అంటున్నాడు సుజీత్.

బాహుబలి-2 సినిమాతో పాటు రిలీజైన సాహో టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదే ఊపులో సినిమాను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారు. దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది సాహో మూవీ.