డియర్ కామ్రేడ్ హిందీ వెర్షన్ అదుర్స్

Dear Comrade Hindi version gets stunning views
Monday, January 20, 2020 - 22:15

విజయ్ దేవరకొండ ఇంకా హిందీ సినిమాలో నటించలేదు. కానీ అప్పుడే పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. నేషనల్ లెవల్ ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు పూరి డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తూ .... పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే, ఆ మూవీ కన్నా ముందే హిందీ మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాడు. 

"డియర్ కామ్రేడ్" హిందీ డబ్బింగ్ వెర్షన్ కు వస్తున్న వ్యూస్, లభిస్తున్న ఆదరణ చూస్తే చాలు ఈ కుర్ర హీరో సెన్సేషన్ ఏంటో చెప్పడానికి.  యూట్యూబ్ లో "డియర్ కామ్రేడ్" హిందీ వెర్షన్ విడుదలైన 24 గంటల్లోనే 11 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇది రేర్ ఫీట్ అనే చెప్పాలి. అద్భుతమైన పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద విఫలమైన డియర్ కామ్రేడ్ అమెజాన్ ప్రైమ్ ఆడియన్స్ ను మాత్రం విశేషంగా ఆకట్టుకొంది. ఇప్పుడు యూట్యూబ్ ఆడియన్స్ ను కూడా అలరిస్తోంది.