ఈ రాత్రికి ఏ స్టార్ ఎక్కడ?

December 31st night, star celebrations
Tuesday, December 31, 2019 - 16:00

ఈరోజు రాత్రి న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి టాలీవుడ్ స్టార్స్ అంతా ఎవరి డెస్టినేషన్స్ వాళ్లు సెట్ చేసుకున్నారు. నాగచైతన్య-సమంత జంట ఇప్పటికే గోవా చేరుకుంది. ఈరోజు రాత్రి ఫుల్లుగా ఎంజాయ్ చేయబోతోంది. మరో 2 రోజులు కూడా అక్కడే ఉంటారు. ఇక బన్నీ కూడా బ్యాంకాక్ చేరుకున్నాడు. కొత్త ఏడాదికి బ్యాంకాక్ నుంచి స్వాగతం చెప్పబోతున్నాడు. ఆశ్చర్యంగా ప్రభాస్ మాత్రం ఈసారి హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఇక్కడే ఎంజాయ్ మెంట్.

తేజస్వి మడివాడ ఇండోనేషియాలోని గిలి ఐల్యాండ్ లో ల్యాండ్ అయింది. అక్కడ్నుంచి హాట్ హాట్ పిక్స్ కూడా రిలీజ్ చేస్తోంది. ఇక శ్రద్ధాదాస్ అయితే మొన్నటివరకు బాలిలోనే ఉంది. కానీ ఈరోజు రాత్రికి మాత్రం ఆమె ఖమ్మంలో ల్యాండ్ అవుతోంది. లేక్ వ్యూ రిసార్ట్స్ లో ఆడిపాడబోతోంది.

ఇక భీష్మ షూటింగ్ కోసం రోమ్ వెళ్లిన రష్మిక అక్కడే ఉండిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకొని తిరిగి ఇండియాకు వస్తుంది. అటు శ్రియ కూడా కొత్త సంవత్సర వేడుకల కోసం భర్తతో కలిసి అతడి దేశమైన రష్యాకు వెళ్తోంది. ప్రస్తుతం ఈమె బార్సినాలోలో కాపురం పెట్టింది. కాంచన-3 హీరోయిన నిక్కీ తంబోలా దుబాయ్ లో ఎంజాయ్ చేస్తోంది.