ఆ రెండూ చాలు జీవితాంతం బతికేస్తా

Deepika Padukone needs those two essentials in life
Thursday, July 16, 2020 - 17:30

జీవితంలో బ్రతకడానికి ఏం కావాలి. ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. ఎవరి ప్రాధామ్యాలు వారివి. మరి ఇదే ప్రశ్న సెలబ్రిటీల్ని అడిగితే ఎలా ఉంటుంది.? కచ్చితంగా కాస్త కొత్తగా సమాధానాలొస్తాయి. హీరోయిన్ దీపిక పదుకోన్ కూడా ఇలాంటి వెరైటీ సమాధానమే ఇచ్చింది.

అభిమానులతో ఛాట్ చేసింది దీపిక. ఈ సందర్భంగా ఓ అభిమాని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. జీవితాంతం ఒకే ఫుడ్ తినాల్సి వస్తే ఏది ప్రిఫర్ చేస్తారనేది ఆ క్వశ్చన్. దీనికి దీపిక పదుకోన్ ఏమాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చింది. తనకు రసం అన్నం, మామిడికాయ పచ్చడి ఉంటే చాలని.. జీవితాంతం బతికేస్తానని చెబుతోంది.

తన ఫుడ్ ఇష్టాల్ని షేర్ చేసుకున్న దీపిక పదుకోన్.. ప్రత్యేకంగా టీ లేదా కాఫీ తాగాలనే నియమం పెట్టుకోనని.. దొరికితే మాత్రం సౌతిండియా ఫిల్టర్ కాఫీ మిస్సవ్వనని అంటోంది. ఇంట్లో మాత్రం తను టీ పెట్టడంలో ఎక్స్ పర్ట్ అని చెబుతోంది