డిజైన‌ర్ ధ‌ని ఏలెకి మ‌రో గౌర‌వం

Dhani Aelay designs TSFDC logo
Thursday, April 19, 2018 - 18:15

ప్ర‌ముఖ డిజైన‌ర్ ధ‌ని ఏలెకి మ‌రో గౌర‌వం ద‌క్కింది. ఇటీవ‌లే నెల‌కొల్పిన తెలంగాణ చ‌ల‌న‌చిత్ర అభివృద్ధి సంస్థ లోగోని ఆయ‌న డిజైన్ చేశారు. ఈ అవ‌కాశాన్ని ఆయ‌న ద‌క్కించుకున్నారు. క్లాప్‌బోర్డ్‌, పాల పిట్ట‌..రెండింటిని మిక్స్ చేసి తెలంగాణ ఆత్మ‌ని లోగోలో ఆవిష్క‌రించారు.

ఆకుప‌చ్చ తెలంగాణ కావాల‌ని స్వ‌ప్నిస్తున్న కేసీఆర్ క‌ల‌, తెలంగాణ ప్ర‌జ‌ల సంస్కృతికి ద‌ర్ప‌ణ‌మైన పాల‌పిట్ట రంగుల‌ను లోగోలో వాడారు. ఎన్నో వంద‌ల సినిమాల‌కి పోస్ట‌ర్స్ డిజైన్ చేసిన ధ‌ని ఈ లోగో డిజైన్‌లోనూ త‌న ప్ర‌త్యేక‌త‌ని చూపారు.