దియా కాపురంలో రాఘవేంద్రరావు కోడలు చిచ్చు?

Dia Mirza splits with hubby, is Kanika Dhillon reason behind this?
Friday, August 2, 2019 - 00:30

దియా మీర్జా తన భర్త నుంచి విడిపోతున్నట్లు నిన్న (గురువారం) అనౌన్స్ చేసింది. ఇది అందరికీ షాకింగ్ గా అనిపించింది. ఇదే రోజు బాలీవుడ్ మీడియా మరో న్యూస్ ని కూడా బ్రేక్ చేసింది. అదేంటి అంటే దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు కొడుకు, కోడలు కూడా విడిపోయారు అనే వార్త గుప్పుమని బయటికి వచ్చింది. మొదట అందరు ఈ రెండు వేర్వేరు న్యూస్లు అనుకున్నారు. అయితే ఈ రెండింటికి లింక్ ఉందని ఒక బాలీవుడ్ వెబ్సైటు రాసింది. 

రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి కూడా దర్శకుడే. తెలుగులో ఆయన తీసిన రెండు సినిమాలు (అనగనగా ఓ ధీరుడు, సైజు జీరో) ప్లాప్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకి కూడా కనికా దిల్లన్ అనే అమ్మాయి స్క్రిప్ట్ రాసింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు, ప్రకాష్ కోవెలమూడి భార్య. అంటే రాఘవేంద్రరావు కోడలు. తెలుగులో రెండు సినిమాలు ఆడకపోవడంతో బాహుబలి వాళ్ళ వచ్చిన కనెక్షన్స్ తో ప్రకాష్ కోవెలమూడి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యాడు. ఆయన భార్య అప్పటికే బాలీవుడ్ లో రా.వన్, మన్మజరియా వంటి సినిమాలకి  కథలు రాసింది, అవి ప్లాప్ అయ్యాయి. అప్పుడే భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయట. ఐనప్పటికీ, ఇద్దరు కలిసి జడ్జిమెంటల్ హై క్యా సినిమాకి వర్క్ చేసారు. కంగనా నటించిన ఈ సినిమాకి ఆమె రైటర్, అతను డైరెక్టర్. సినిమాకి క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ వచ్చాయి కానీ సినిమా పెద్దగా ఆడటం లేదు. 

ఇక దియా విషయానికి వద్దాము. దియా తాను భర్త నుంచి విడిపోతున్నటు ప్రకటించగానే ...బాలీవుడ్ వెబ్సైట్ ఒక గుసగుసని బయటపెట్టాయి. ప్రకాష్ కోవెలమూడికి కొంత కాలంగా దూరంగా ఉంటున్న కనికా ...దియా భర్త షాహిల్ తో ఎఫైర్ నడిపింది అంట. ఆ కారణం వల్లే దియా భర్త నుంచి విడిపోయింది అంట. ఇందులో నిజమెంతో తెలీదు కానీ బాలీవుడ్ వెబ్సైట్ మాత్రం ఈ విషయాన్ని ప్రముఖంగా టామ్ టాం చేస్తున్నాయి.