త్రివిక్ర‌మ్ మార్క్ ఇందులో ఉంది!

Dialogues of Pawan Kalyan - Trivikram's Agnyaathavaasi
Wednesday, January 10, 2018 - 20:00

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌కి మాట‌ల మాంత్రికుడు అనే పేరుంది. ఆయ‌న రైట‌ర్‌గా అందించిన గొప్ప సినిమాలు చాలా ఉన్నాయి. త్రివిక్ర‌మ్ డైలాగ్స్‌కి ఎఫ్‌బీలో పెద్ద అభిమానులగ‌ణ‌మే ఉంది. తాజాగా విడుద‌లైన అజ్ఞాత‌వాసిలో త్రివిక్ర‌మ్ పంచ్‌ల‌కి ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. డైలాగ్‌బాజీకి చోటు క‌ల్పించ‌లేదు. ఐనా.. అక్క‌డ‌క్క‌డా త‌న చెణుకులు, వావ్ అనిపించే సంభాష‌ణాల‌ను చొప్పించారు. శాంపిల్‌గా కొన్ని...

 • విచ్చలవిడిగా నరికేస్తే హింస .... విచక్షణతో నరికేస్తే ధర్మం.
   
 • జీవితంలో మ‌నం కోరుకునే ప్ర‌తి సౌక‌ర్యం వెనుకాల ఓ మినీ యుద్ద‌మే ఉంటుంది.
   
 • అధికారంలోకి రావాలంటే ఏజ్‌, సైజ్ ఉండాల‌ని అన‌ను. ఇది (హార్ట్ చూపిస్తూ) ఉండాలి.
   
 • విమానంలో ప్ర‌యాణించేవారంతా మ‌నం గాల్లో వెళ్తున్నాం అనుకుంటారు. కానీ మ‌నం కూర్చొంటాం, విమానం గాల్లో ఎగురుతుంది.
 • ఎప్పుడూ జరిగేదాన్ని అనుభవం అంటారు..ఎప్పుడో జరిగేదాన్ని అద్భుతం అంటారు
   
 • రాజ్యం మీద ఆశ లేని వాటికంటే గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు
   
 • మా నాన్న మూసిన తలుపులకు అవతల చనిపోయిన మీ అన్నయ్యనే చూస్తున్నావ్...ఆయన బ్రతికించిన కుటుంబాలని వెలిగించిన దీపాల్ని నువ్వు చూడట్లేదు, చూడలేదు, చూడలేవు