5 నెలల కిందటే టైటిల్ చెప్పిన బన్నీ

Did Allu Arjun reveal title 5 months back?
Friday, April 10, 2020 - 11:30

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య-2 రీసెంట్ గా పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా బన్నీ ట్వీటాడు. తన సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు. సుక్కూ హెయిర్ కలర్ మారినా, నా స్కిన్ మారినా మా మధ్య ప్రేమ మాత్రం మారలేదన్నాడు. మా ఇద్దరి బంధం ఏమాత్రం మారలేదని, దాన్ని త్వరలోనే చూస్తారని కూడా చెప్పుకొచ్చాడు.

ఆ సందర్భంగానే గత ఏడాది నవంబర్ లో పుష్ప అనే టైటిల్ ను రివీల్ చేశాడు బన్నీ. ఇంగ్లిష్ అక్షరాలే కాస్త డిఫరెంట్ గా మార్చి (పైన ఫొటోలో చూడొచ్చు) టైటిల్ ను బయటపెట్టాడు. కాకపోతే ఆ టైమ్ లో అది ఎవ్వరికీ అర్థంకాలేదు. పైగా చాలామంది దాన్ని పట్టించుకోలేదు కూడా. పైగా అదేదో ఆర్య-2 రిలేటెడ్ అనుకున్నారు. కట్ చేస్తే.. అది పుష్ప టైటిల్ అనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైంది.

సరిగ్గా బన్నీ పెట్టిన ఆ ట్వీట్ కు కొన్ని రోజుల ముందే పుష్ప ప్రాజెక్ట్ సెట్ అయింది. మహేష్ బాబు నో చెప్పడంతో డైరక్ట్ గా వచ్చి మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి బన్నీ హీరోగా ఆ ప్రాజెక్టు ప్రకటించాడు సుకుమార్. అంటే.. మహేష్ బాబుకు కూడా పుష్ప అనే టైటిల్ తోనే కథ చెప్పినట్టున్నాడు సుక్కూ.