బోయ‌పాటి కావాల‌నే బ్యాండ్ వేశాడా?

Did Boyapati do this intentionally to help Balayya?
Saturday, January 12, 2019 - 00:45

బోయ‌పాటి తీసిన "విన‌య విధేయ రామ" సినిమా విడుద‌లైంది. విమ‌ర్శ‌కులంద‌రూ కూడ‌బ‌లుక్కొని రాసిన‌ట్లు....ఒకేతీరుగా సినిమాని చీల్చి చెండారు. ఆ రేంజ్‌లోనే బ్యాడ్‌గా ఉందిలెండి. ఇక సోష‌ల్ మీడియాలో ఈ సినిమాపై ఒక రేంజ్‌లో ట్రోలింగ్ జ‌రుగుతోంది. బోయ‌పాటి మేకింగ్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

రేటింగ్స్‌, విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా..తొలి రోజు ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ను అందుకొంది. సంక్రాంతి సెల‌వులు కూడా ఊపందుకోవ‌డంతో... మ‌రో నాలుగు అయిదు రోజుల వ‌ర‌కు ఈ సినిమా క‌లెక్ష‌న్ల‌కి పెద్ద‌గా స‌మ‌స్య ఏమీ ఉండ‌దు. రెవిన్యూ సంగతెలా ఉన్నా.. బ్యాడ్‌నేమ్ మాత్రం బాగా వ‌చ్చింది. 

కొంద‌రు చ‌ర‌ణ్ అభిమానులు కొంత వెరైటీ వాదన‌ని పైకి తీసుకొచ్చారు. బోయ‌పాటి బేసిక‌ల్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ క్యాంప్‌. కాబ‌ట్టే... ఈ సినిమాని కావాల‌నే చెడ‌గొట్టాడ‌ని అంటున్నారు. మ‌రి బ‌న్నికి కెరియ‌ర్ బిగ్గెస్ట్ హిట్ (స‌రైనోడు) ఇచ్చింది బోయ‌పాటి అనే దానికి స‌మాధానం లేదు. వీరి వాద‌న ఏంటంటే... "ఎన్టీఆర్ క‌థానాయ‌కుడి"కి పోటీగా ఇది విడుద‌ల కానుంది కాబ‌ట్టి బాల‌య్య‌కి హెల్ప్ చేసే ఉద్దేశంతోనే బోయ‌పాటి మ‌రీ ఇంత ఔటాఫ్ ది వేలో తీశాడ‌ని మెగాభిమానులు అంటున్నారు. 

కానీ బోయ‌పాటి స‌న్నిహితులు ఆయ‌న అలాంటి ద‌ర్శ‌కుడు కాదు.. ఏ హీరోతో అయినా వారికి బెస్ట్ ఇచ్చేందుకే ప్ర‌య‌త్నిస్తాడంటున్నారు. ఐతే..ఈ సారి క‌థ లేకుండా సెట్స్‌కి వెళ్ల‌డంతోనే ఇంత స‌మ‌స్య వ‌చ్చింద‌ట‌.