రాజమౌళి ప్లాన్ వర్కవుట్ అయిందా?

Did Rajamouli play work out this lockdown period?
Saturday, March 28, 2020 - 14:15

కరోనా టైమ్ లో ఈ టీజర్లు రిలీజ్ ఏంటి, టైటిల్ అనౌన్స్ చెయ్యడం ఏంటి అని మొన్న విమర్శలు వచ్చాయి రాజమౌళిఫై. ఐతే, ఆయన ప్లాన్ మాత్రం వర్కౌట్ అయింది అని అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉన్నారు. అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. జనాలకి ఎదో ఒక టైంపాస్ కావాలి. సో... ఈ టైంలో ప్రమోషన్ మొదలు పెట్టి రాజమౌళి కరెక్ట్ పని చేసినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

"ఆర్.ఆర్.ఆర్" సంక్రాంతికి కూడా విడుదల కాదు, మరోసారి వాయిదా పడుతుంది అనే ఊహాగానాల నేపథ్యంలో ఈ వీడియోలతో అన్నిటికి ఎండ్ కార్డు వేశారు రాజమౌళి. సో అయన ప్లాన్ వర్క్ అవుట్ అయింది. 

బాహుబలి నుంచి రాజమౌళి మార్కెటింగ్ మీద బాగా శ్రద్ధ పెట్టారు. నయా పైసా ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలి అనే విషయంలో రాజమౌళి టీం పీహెచ్డీ చేసింది అంటారు. అది మరోసారి నిజం అయింది. కరోనా టైంని తెలివిగా యూజ్ చేసుకున్నారు మరి.